Telangana Group 4 Jobs 2026

Telangana Collector Office Jobs 2026: 5వ తరగతి, 7వ తరగతి, ఇంటర్ అర్హతతో 20 ఉద్యోగాలు!

తెలంగాణలోని కరీంనగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం పరిధిలో దివ్యాంగుల బ్యాక్‌లాగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ అసిస్టెంట్, లైబ్రేరియన్-III, ఆఫీస్ సబార్డినేట్, శానిటరీ జవాన్, కుక్, కమాటి, పబ్లిక్ హెల్త్ వర్కర్ తదితర పోస్టులతో కలిపి మొత్తం 20 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అర్హులైన దివ్యాంగ అభ్యర్థులు పోస్టును బట్టి 5వ తరగతి, 7వ తరగతి, ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ అర్హతతో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఉద్యోగాల వివరాలు

  • సంస్థ: జిల్లా కలెక్టర్ కార్యాలయం, కరీంనగర్
  • మొత్తం పోస్టులు: 20
  • పోస్టులు: జూనియర్ అసిస్టెంట్, లైబ్రేరియన్-III, ఆఫీస్ సబార్డినేట్, శానిటరీ జవాన్, కుక్, కమాటి, పబ్లిక్ హెల్త్ వర్కర్ తదితర పోస్టులు.
  • అర్హతలు: 5వ తరగతి, 7వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ (పోస్టును బట్టి).
  • వయస్సు: 18 నుంచి 44 సంవత్సరాలు.
  • దరఖాస్తు ఫీజు: లేదు.
  • చివరి తేదీ: 05-12-2026, సాయంత్రం 5 గంటల వరకు.
ALSO READ  తెలంగాణా కలెక్టర్ ఆఫీసుల్లో 100 పోస్టులతో జాబ్స్ | Telangana Collector Office Jobs Notification 2024 | Latest Jobs In Telugu

విద్యార్హతలు

పోస్టులను బట్టి 5వ తరగతి, 7వ తరగతి, ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. లైబ్రేరియన్ పోస్టుకు లైబ్రరీ సైన్స్ సర్టిఫికెట్ కోర్సు (CLISC) అర్హత అవసరం. ప్రతి పోస్టుకు నిర్దేశించిన దివ్యాంగ కేటగిరీకి చెందిన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.

Telegram Group Join Now

ఎంపిక విధానం

అభ్యర్థుల ఎంపిక మొత్తం 100 మార్కుల ఆధారంగా జరుగుతుంది.

  • విద్యార్హత మార్కులు: 80 మార్కులు.
  • దివ్యాంగుల శాతం: 10 మార్కులు.
  • వయస్సు: 10 మార్కులు.
ALSO READ  Flipkart లో ఉద్యోగాలు | Flipkart Recruitment 2024 | Ramcareers

జీతభత్యాలు

ఎంపికైన అభ్యర్థులకు పోస్టును బట్టి నెలకు రూ.18,000 నుంచి రూ.36,000 వరకు వేతనం ఉంటుంది.

దరఖాస్తు విధానం

అభ్యర్థులు దరఖాస్తు ఫారమ్‌ను అధికారిక నోటిఫికేషన్ నుంచి డౌన్‌లోడ్ చేసుకుని, విద్యార్హత ధ్రువపత్రాలు, సదరం సర్టిఫికెట్, ఎంప్లాయ్‌మెంట్ కార్డు, జనన తేదీ నిర్ధారణ పత్రం, రెండు పాస్‌పోర్ట్ సైజు ఫోటోలతో దరఖాస్తు సమర్పించాలి.

దరఖాస్తులను జిల్లా సంక్షేమ అధికారి, మహిళలు, పిల్లలు, దివ్యాంగులు మరియు వయోవృద్ధుల శాఖ, రూమ్ నంబర్ 7, నూతన కలెక్టర్ కార్యాలయం, కరీంనగర్ వద్ద సమర్పించాలి. రిజిస్టర్డ్ పోస్టు ద్వారా లేదా నేరుగా అందజేయవచ్చు.

ALSO READ  HCL లో 6 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు | HCL Recruitment 2023 | Work From Home Jobs 2023

చివరి తేదీ: 05 డిసెంబర్ 2026, సాయంత్రం 5 గంటలు.

ముఖ్యమైన లింకులు:

గమనిక: ఇవి దివ్యాంగుల బ్యాక్‌లాగ్ పోస్టులు. పోస్టుల వారీగా నిర్దిష్ట దివ్యాంగ కేటగిరీలు కేటాయించారు. దరఖాస్తు చేసే ముందు అధికారిక నోటిఫికేషన్‌ను తప్పనిసరిగా పరిశీలించండి.

Leave a Comment