APPSC Group 2 Full Notification 2026

APPSC Group 2 Notification 2026: 720 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. డిగ్రీ అర్హతతో అప్లై చేయండి!

ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు శుభవార్త. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి పూర్తి నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్ నం.37/2026 ద్వారా మొత్తం 720 ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు నవంబర్ 10 నుంచి డిసెంబర్ 11, 2026 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

పోస్టుల వివరాలు

మొత్తం 720 పోస్టుల్లో 471 ఎగ్జిక్యూటివ్, 249 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయి.

Telegram Group Join Now
  • డిప్యూటీ తహసీల్దార్ – 203
  • డిప్యూటీ ఎంపీడీవో – 176
  • అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ – 80
  • సీనియర్ అకౌంటెంట్ – 91
  • జూనియర్ అకౌంటెంట్ – 47
  • జీఎస్టీ ఆఫీసర్ – 40
  • ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎస్‌ఐ – 29
  • ఇతర పోస్టులు – 54
ALSO READ  3,000 పోస్టులతో CBI లో ఉద్యోగాలు | Jobs 2024 | Central Bank Of India Jobs 2024

విద్యార్హతలు

గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు చాలా పోస్టులకు అర్హులు. అయితే ఫైనాన్స్, లా విభాగాల అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, అకౌంటెంట్ పోస్టులకు ప్రత్యేక విద్యార్హతలు, కంప్యూటర్ అర్హతలు అవసరం.

వయోపరిమితి

01-07-2026 నాటికి పోస్టును బట్టి కనీస వయస్సు 18 నుంచి 21 సంవత్సరాలు, గరిష్ఠ వయస్సు 30 నుంచి 44 సంవత్సరాలు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు నిబంధనల ప్రకారం వయోసడలింపు ఉంటుంది.

ALSO READ  Zomato లో 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ | Zomato Recruitment 2024 | Ramcareers

ఎంపిక విధానం

  1. ప్రిలిమినరీ పరీక్ష – 150 మార్కులు.
  2. మెయిన్స్ పరీక్ష – 300 మార్కులు.
  3. కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ (అర్హత పరీక్ష).
  4. సర్టిఫికెట్ల పరిశీలన.

ప్రిలిమ్స్ పరీక్ష తేదీ: 21 ఫిబ్రవరి 2027.

దరఖాస్తు ఫీజు

  • ప్రాసెసింగ్ ఫీజు: రూ.250.
  • పరీక్ష ఫీజు: రూ.80.
  • ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, మాజీ సైనికులు, వైట్ రేషన్ కార్డు కలిగిన కుటుంబాలు, అర్హులైన నిరుద్యోగ యువతకు పరీక్ష ఫీజు మినహాయింపు ఉంటుంది.

దరఖాస్తు తేదీలు

  • దరఖాస్తుల ప్రారంభం: 10-11-2026.
  • చివరి తేదీ: 11-12-2026 రాత్రి 11:59 గంటలు.
  • ప్రిలిమ్స్ పరీక్ష: 21-02-2027.
ALSO READ  SSC CGL Notification 2025

దరఖాస్తు విధానం

అభ్యర్థులు ముందుగా APPSC అధికారిక వెబ్‌సైట్‌లో OTPR నమోదు చేసుకోవాలి. అనంతరం లాగిన్ అయి గ్రూప్-2 అప్లికేషన్‌ను ఎంచుకుని వ్యక్తిగత, విద్యార్హత వివరాలు నమోదు చేసి ఫోటో, సంతకం అప్‌లోడ్ చేసి ఫీజు చెల్లించాలి. దరఖాస్తును సమర్పించిన తర్వాత ప్రింట్ తీసుకోవాలి.

ముఖ్యమైన లింకులు:

గమనిక: పోస్టుల వారీగా విద్యార్హతలు, వయోపరిమితి, రిజర్వేషన్లు, జోన్ల వారీ ఖాళీలు వేర్వేరుగా ఉంటాయి. దరఖాస్తు చేసే ముందు అధికారిక నోటిఫికేషన్‌ను పూర్తిగా పరిశీలించండి.

Leave a Comment